calender_icon.png 26 November, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన

26-11-2025 12:00:00 AM

-టీఎన్జీవో ఆధ్వర్యంలో సదస్సు

-హాజరైన మారెం జగదీశ్వర్, డాక్టర్ హుస్సేని 

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవోస్) యూనియన్, హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షుడు విక్రమ్‌కుమార్, కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్ నాయకత్వంలో మంగళవారం హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల కోసం ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన సదస్సు, స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. జిల్లాలోని అన్ని కేడర్లకు చెందిన వందలాది మంది మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

అనేక మంది ఉద్యోగులకు ప్రాథమిక పరీక్షలు, స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి నుంచి డా. సూర్యశ్రీ (ఆసుపత్రి తనిఖీలు, సే వలు, ప్రోగ్రామింగ్ ఆఫీసర్), డా. సౌజన్య, డా.స్వాతి, డా.సంకల్ప్ ఉద్యోగులకు క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను గుర్తించడంపై వివరం గా అవగాహన కల్పించారు. టీఎన్జీవోస్ సెం ట్రల్ యూనియన్ అధ్యక్షుడు మారెం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం హు స్సేని (ముజీబ్), అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, కోశాధికారి ఎం. సత్యనారాయణ గౌడ్, డా. సూర్యశ్రీ, డిప్యూటీ డైరెక్టర్, ట్రెజరీస్ డిపార్ట్మెంట్ వసుంధర పా ల్గొన్నారు.

జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగులు ఇంటి పనులు పూర్తి చేసుకుని కార్యాలయానికి వచ్చి, ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో పనిచేయడం వలన వైద్య పరీక్షలకు తగిన సమ యాన్ని కేటాయించలేకపోతున్నారని, అందు కే యూనియన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. శిబిరం నిర్వహణకు అను మతినిచ్చి, పూర్తి సహాయ సహకారాలు అం దించిన జగదీశ్వర్, డాక్టర్ ఎస్.ఎం. హుస్సేనిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డా. ఎస్‌ఎం హుస్సేని (ముజీబ్) మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగులలో క్యాన్సర్ కేసులు ఆందోళనకరమైన స్థాయిలో పెరుగుతున్నాయని, ఈ విషయంలో ఉద్యోగులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆయన క్యాన్సర్ చికిత్సలో ప్రారంభ దశలో గుర్తించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. మారెం జగదీశ్వర్ ఈ అవగాహన శిబిరాన్ని నిర్వహించిన జిల్లా యూనియన్‌ను అభినందించారు. మహిళా ఉద్యోగులు కుటుంబ బాధ్యతలను, కార్యాలయ పనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నం దున వారి ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడారు.

కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కె.ఆర్. రాజ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యు లు గీత, ఖాలేద్ అహ్మద్, శంకర్, వైదిక్ శేస్త్ర, శ్రీధర్, ముఖీం ఖురేషి, యూనియన్ (సిటీ) అధ్యక్షుడు శ్రీకాంత్, కార్యదర్శి హరికృష్ణ, సెంట్రల్ యూనియన్ ప్రతినిధులు శైలజ, గీత, నాగిరెడ్డి, యూనిట్ అధ్యక్షులు, కార్యదర్శులు రాజు, నరేందర్, శ్రీదేవి, సాహితి, కాంత కుమారి, చంద్రశేఖర్ ఎంఎన్‌జే యూ నిట్ సెక్రటరీ, ఏపీఆర్‌వో మొహ మ్మద్ వహీద్ పాల్గొన్నారు.