26-11-2025 12:00:00 AM
ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి
శామీర్ పేట్, నవంబర్ 25: రాష్ట్రంలో మహిళా సంఘాలకు రూ.304 కోట్ల వడ్డీలేని రుణాలు ప్రభుత్వం అందజేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం శామీర్పేటలోని అలియాబాద్ శుభం కన్వెన్షన్ హాల్లో జరిగినమహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమా నికి స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
మేడ్చల్ నియోజకవర్గం కి చెందిన 3210 మహిళా సంఘాల సభ్యులకు రూ. 2 కోట్ల 33 లక్షల వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనంగా మరోసారి రాష్ట్రంలోని 3లక్షల 50 వేల స్వయం సహాయక మహిళా సంఘాలకు 304 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందించనున్నది.
మేడ్చల్ నియోజకవర్గం లో గత 24నెలలుగా 2కోట్ల 53లక్షల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారని మహేందర్ రెడ్డి వివరించారు . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనో చౌదరి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు అజయలక్ష్మి, మహేష్ గౌడ్ , ముజుబుద్దిన్, జైపాల్ రెడ్డి, ఆర్డిఓ సాంబశివం, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.