calender_icon.png 31 August, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణపతి పాటను ఆవిష్కరించిన పారమిత విద్యాసంస్థల చైర్మన్

30-08-2025 06:30:22 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నగరంలోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న కిట్ల చరణ్ ఆలపించి, నటించిన “ఎలుక మీద రావయ్యా ఓ గణపయ్యా” అనే గీత పోస్టర్, యూట్యూబ్ మాధ్యమంలో పారమిత విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఇనుగంటి ప్రసాదరావు శనివారం ఆవిష్కరించారు. చక్కటి సంగీతాన్ని అందించిన చిన్నారి చరణ్ ను పారమిత విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఇ.ప్రసాద రావు, డైరెక్టర్స్ టి.యస్.వి.రమణ, హన్మంత రావు, విద్యార్థి తండ్రి  కిట్ల శ్రీనివాస్, పి.డి. రామానంద తీర్థలు అభినందించారు.