30-08-2025 06:29:23 PM
చొప్పదండి (విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతూ, ప్రమాదంలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం భరోసా కల్పిస్తోందని గంగాధర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పురుమల్ల మనోహర్(Congress Party President Purumalla Manohar) అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 22,56,500 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం గంగాధర మండలం మధురానగర్ లోని ఎమ్మెల్యే ప్రజా కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ వైఎస్ చైర్మన్ తోట కరుణాకర్, బుర్గు గంగన్న, సాగి అజయ్ రావు, సత్తు కనుకయ్య, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, రెండ్ల రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గరికంటి కరుణాకర్, ముచ్చ శంకరయ్య, దొమ కొండ మహేష్, మల్లయ్య, శంకర్, మ్యాక వినోద్, ఎమిరెడ్డి నాగేంద్రర్ , శ్రీనివాస్, మంత్రి మహేందర్, పవుల్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.