27-01-2026 12:00:00 AM
దేవరకొండ (చందంపేట) జనవరి 26 : నియోజకవర్గం లోని చందంపేట మండల కేంద్రంలో గల ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి గ్రామ సర్పంచ్ సాదిక్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సోమవారం తన సొంత నిధులతో 30 కుర్చీలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దవాఖానకు వచ్చేవారికి ఇబ్బందులు కలగకూడదు అన్న ఉద్దేశంతో కుర్చీలను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జరుపుల బధ్యా నాయక్, ఉపసర్పంచ్ జబ్బు శ్రీశైలం యాదవ్, డాక్టర్ రాజేష్, పలువురు వార్డు సభ్యులు, గ్రామ యువకులు, సిబ్బంది పాల్గొన్నారు