11-09-2025 01:23:05 AM
అమీన్ పూర్, సెప్టెంబర్ 10 : అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బిరంగూడ మండే మార్కెట్ వద్ద రజక సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమీన్ పూర్ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కాటా సునీత రాజు గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యా రు. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కాటా సునీత రాజుగౌడ్ మాట్లాడు తూ భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరా ట స్పూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కా ర్యక్రమంలో నరసింహ, ఆంజనేయులు, ప్రసాద్, మల్లేష్, నాగేష్, రజక సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.