calender_icon.png 27 September, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

27-09-2025 12:51:04 AM

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 26, (విజయక్రాంతి):చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలను శుక్రవారం కొత్తగూడెం పోలీస్ హెడ్ కోటర్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్బంగా ఎస్పి రోహిత్ రాజ్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సం దర్బంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని, భూమి కోసం,భుక్తి కోసం వె ట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని,ఆత్మగౌరవాన్ని చాటిచెప్పాయన్నారు.

ఇలాంటి పోరాట యోధుల ఆశయాల సాధన కొరకు ప్రతి ఒక్కరూ భాద్యతగా నడుచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్ నరేందర్, కొత్తగూడెం డిఎస్పి రెహమాన్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,ఆర్‌ఐలు సుధాకర్, నరసింహారావు, రవి,లాల్ బాబు,కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.