calender_icon.png 27 September, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ బహుజనుల ఆత్మగౌరవ, సమానత్వ పోరాట స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ

27-09-2025 01:12:19 AM

- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

కరీంనగర్, సెప్టెంబరు 26 (విజయ క్రాంతి): తెలంగాణ బహుజనుల ఆత్మగౌరవ, సమానత్వ పోరాటాల స్పూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ అని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాటం భూమి కోసమే కాదని, నిజాం పాలనలో మహిళలు, రైతులు, బహుజనులు ఎదుర్కొన్న అంతులేని వివక్షను ఎదురించిన వీరనారి అని అన్నారు. అరెస్టులు, జైలు జీవితాన్ని అనుభవించినప్పటికీ నిజాం బానిసత్వానికి తలొగ్గకుండా సాగుచేసిన భూమిపై హక్కుల కోసం రైతులతో కలిసి ముందుండి పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ జయంతిని జరుపుకోవడమంటే తెలంగాణ రైతాంగ, బహజనుల, మహిళల ఆత్మగౌరవ పోరాటాన్ని భావి తరాలకు తెలియజేయడమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, తదితరులుపాల్గొన్నారు.