calender_icon.png 27 September, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర మరవలేనిది

27-09-2025 01:11:52 AM

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

వలిగొండ, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ పాత్ర మరువలేనిదని భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం వలిగొండ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని పూలమాలలు సమర్పించి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం లో భూమికోసం,

భుక్తి కోసం, విముక్తి కోసం ఐలమ్మ చేసిన త్యాగం మరువలేదని ఆమె రగిలించిన స్ఫూర్తి ఎందరికో ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. చాకలి ఐలమ్మ 130వ జయంతిని జరుపుకోవడం మంచి పరిణామం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాశం సత్తిరెడ్డి, గరిస రవి, మైసోల్ల లక్ష్మీనర్స్, సత్యనారాయణ, యాదగిరి ప్రవీణ్, శివకుమార్, మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు.

భూస్వాములపై ఎగిసిపడిన దిక్కార స్వరం ఐలమ్మ:  ఎమ్మెల్యే  వీరేశం 

నకిరేకల్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి భూస్వాములపై ఎగిసిపడిన ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కొనియాడారు.  శుక్రవారం నకిరేకల్ పట్టణంలోని ఇందిర గాంధీ సెంటర్లో  చాకలి ఐలమ్మ జయంతిసందర్భంగా వారిచిత్రపటానికి పూలమాలవేసి  ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక., తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మని ఆయన పేర్కొన్నారు. ఆమె స్ఫూర్తి,పోరాటం భావిత రాలకు ఆదర్శంగా ఉన్నారు. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు.చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని ముందుకెళ్లాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్  చౌగోని రజిత శ్రీనివాస్, నాయకులు. చామల శ్రీనివాస్, పున్న కైలాస నేత, కొండ వెంకన్న గౌడ్ ,గాజుల సుకన్య ,మట్టిపల్లి వీరు, లింగాల వెంకన్న కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కట్టంగూర్ లో చాకలి ఐలమ్మ జయంతిని   ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జ్ఞాన ప్రకాష్ రావు, అధికారులు  స్వరూప రాణి, చింతపల్లి చలపతి, కడెం రామ్మోహన్ , సైదులు తదితరులు పాల్గొన్నారు.

పోరాటానికి నాంది పలికిన ధీరవనిత చాకలి ఐలమ్మ

నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 26 : తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ 130 వ జయంతి ని పురస్కరించుకొని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నల్గొండ జిల్లా కేంద్రంలో నాగర్జున సాగర్ రోడ్ లో ఉన్న ఐలమ్మ విగ్రహానికి ఆమె  పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సంద ర్భంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూస్వా మ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరా టంలో  ఐలమ్మ కీలక పాత్ర పోషించారని, ఆనాటి దేశ్ ముఖ్‌లపై తిరుగుబాటుచేసి భూ పోరాటానికి నాంది పలికారని, తెలం గాణ ఉద్యమంలో చాకలి ఐలమ్మ పాత్ర ఎంతో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐల మ్మ జయంతిని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26న అధికారికంగా నిర్వహిస్తున్న విష యాన్ని ఆమె గుర్తు చేశారు.

వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసు కొని ముందుకు వెళ్లాలని ఆమె పిలుపు నిచ్చారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్, ఇన్చార్జి డిఆర్‌ఓ వై. అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇంచార్జి బీసీ సంక్షేమ అధికారి రాజ్ కుమార్, బీసీ సంఘాల ప్రతినిధులు కొండూరు సత్య నా రాయణ, రామరాజు, వీర నారి  చాకలి  ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

వీర నారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి 

యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 26 ( విజయ క్రాంతి ) : వీర నారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు.  శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం లో జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు,రజక కుల కులస్థులతో, ఇతర కుల సంఘాల నాయకులు, అధికారులతో కలసి జ్యోతిప్రజ్వలన చేసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ  సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం తెలంగాణ ప్రాంతంలో రైతాంగ సాయుధ పోరాట యోధురాలిగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు బాసటగా నిలిచిన మహనీయురాలని,నేటితరం  ఆమె అడుగు జాడల్లో నడుస్తూ సమాజ చైతన్యానికి పాటుపడాలన్నారు.   విద్యలో రాణిస్తూ యువత ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు. 

ఈ కార్యక్రమం లో పాల్గొన్న వివిధ సంఘాల ప్రతినిధులు వీర నారి చాకలి ఐలమ్మ పోరాటాలు, పోరాటం కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సాహితి, జేఏసీ చైర్మన్ ఉపేందర్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్  జగన్మోహన్ ప్రసాద్,జిల్లా అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చిట్యాల..

చిట్యాల, సెప్టెంబర్ 26 (విజయ క్రాంతి):   తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను శుక్రవారం ఉరుమడ్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన నిప్పుకణిక తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ  జయంతి సందర్భంగా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద  చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో గ్రామపం చాయతీ కార్యదర్శి రావిరాల ఉపేందర్, పల్లపు బుద్ధుడు, కోనేటి యాదగిరి, పోలగోని స్వామి గౌడ్, చెరుకు సైదులు, ఐతరాజు నరసింహ, గుత్తా  రవీందర్ రెడ్డి, పాకాల దినేష్, మర్రి రమేష్, ఉయ్యాల మల్లేష్, పాకాల సత్యనారాయణ, బెలిజ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేట..

సూర్యాపేట, సెప్టెంబర్ 26 (విజయ క్రాంతి) : తెలంగాణ రైతాంగ ఉద్యమానికి ఊపిరి పోసి తన ప్రాణాలను త్యాగం చేసి ఉద్యమ స్ఫూర్తి నింపిన వీర వనిత చాకలి ఐలమ్మ  జయంతిని జిల్లా పోలీస్ కార్యాల యంలో శుక్రవారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్ర పటానికి ఎస్పి నరసింహ పూలమాల వేసి నివాళులుర్పిం చారు.

అనంతరం మాట్లాడుతూ నిజాం రజాకార్లకు వ్యతిరే కంగా పోరాటం చేసిన వీర వనిత  ఐలమ్మ అన్నారు. సామాజిక న్యాయం కోసం, పేదల హక్కుల కోసం పో రాడిన ఆమె నిజమైన వీరవనిత అన్నారు. ఆమె ఆశయాలను కొనసాగించడం మనం దరి బాధ్యత అన్నారు.  అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి, డిసిఆర్‌బి డిఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఆర్‌ఎస్‌ఐ లు అశోక్, సాయిరాం, సిబ్బంది పాల్గొన్నారు.