01-08-2025 12:15:23 AM
గద్వాల జూలై31 : గద్వాల్ పట్టణంలో కార్మికులు రాలి నిర్వహించి ఆందోళనలు చే పట్టారు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉ ద్యోగులకు కనీస వేతనం, భద్రత, పింఛన్ వంటి ప్రాథమిక హక్కుల కోసం ట్రేడ్ యూ నియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం ‘చలో కలెక్టరేట్‘ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన హెల్త్, ము న్సిపల్, విద్య, పంచాయతీ రాజ్, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడు తూ కనీస వేతనం రూ.26,000 నెలకు అ మలులోకి తేవాలి, పనిచేసిన సంవత్సరాల మేరకు కనీస స్థిర పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి,
కార్మికుల హక్కులకు విరుద్ధంగా ఉ న్న నాలుగు కొత్త లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలన్నీ ,పని గంటల పెంపు పునరాలోచన చేయాలి ఔట్ సోర్సింగ్ విధా నాన్ని మానివేసి, ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నీ డిమాండ్ చేశారు. అనంతరం సంబందించిన అధికారికి వినతిపత్రంనుఅందచేశారు.