26-08-2025 02:16:42 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 25: జీఎస్టీని సరళీకరించడం వల్ల ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రభు త్వంపై రూ. 40,000 వేల కోట్ల భారం పడనుందని.. ఈ లోటును ఎదుర్కోవడానికి ప్ర భుత్వం సన్నాహకాలు చేస్తోందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలపై జీఎస్టీ భారాన్ని తగ్గించేం దుకు ప్రభుత్వం రెండు స్లాబులతో కూడిన జీఎస్టీని ప్రవేశపెట్టాలని చూస్తోంది. వచ్చే నె ల 3 తేదీల్లో న్యూఢిల్లీలో ఆర్థిక మంత్రి ని ర్మలాసీతారామన్ అధ్యక్షతన 56 వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ జరగబోతుంది.
ఈ సమావేశంలోనే జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రుల బృం దం కూడా రెండు స్లాబుల జీఎస్టీకి జైకొట్టింది. ఈ ముసాయిదాలో లోటుకు సం బంధించిన వివరాలు స్పష్టంగా ఉన్నాయి. కొత్త జీఎస్టీ విధానంలో 5, 18 స్లాబులతో పాటు సిన్ గూడ్స్‌కు 40 శాతం పన్ను విధించనున్నారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు భా రీ స్థాయిలో రెవెన్యూ నష్టపోనున్నాయి.
తాత్కాలికమే..
రెవెన్యూ నష్టం అనేది తాత్కాలికమే అని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వస్తువుల రేట్లు తగ్గడం వల్ల ప్రతి ఒక్కరిలో కొనుగోలు సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా వారు అధికంగా ఖర్చు చేస్తారు. సెప్టెంబర్ 3-4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ 56వ భేటీ జరగనుంది. ఈ సమావేశాన్ని అక్టోబర్‌లో నిర్వహించాలని మొదట్లో భావించినా రాష్ట్రాలతో సంప్రదింపుల తర్వాత సమావేశం ముం దుగానే జరుపనున్నారు. వచ్చే విజయదశమి (అక్టోబర్ 2) నుంచి ప్రభుత్వం కొత్త జీఎస్టీ విధానం అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. ‘అన్ని అనుకున్నట్లు జరిగితే జీఎస్టీ నూతన విధానం త్వరలోనే అమల్లోకి రానుంది. దసరా వరకు కొత్త విధానం రానుంది’ అని ఓ అధికారి పేర్కొన్నారు.