27-08-2025 03:03:55 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 26 (విజయక్రాంతి): వినాయక చవితి సందర్భంగా కాచిగూడ లోని బద్రుక కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీ యాజమాన్యం మంగళవారం ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసింది. 10 సంవత్సరాల నుంచి ఉచితంగా విగ్రహాలను పంపి ణీ చేస్తున్నట్టు కళాశాల డైరెక్టర్ జనరల్ ఎస్ అభిరామ్ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ ఆర్ కెవి రెడ్డి, ఈ ఉమేష్ రావు, సంగీత కపూర్, నాగసుజాత, కళాశాల సిబ్బం ది తదితరులు పాల్గొన్నారు.