calender_icon.png 10 September, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛాంపియన్.. చంద్రకళ

10-09-2025 12:00:00 AM

యంగ్ హీరో రోషన్ ప్రస్తుతం ‘ఛాంపియన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దర్శకుడు ప్రదీప్ అద్వైతం దీన్ని పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.  స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టీజర్ గ్లింప్స్ విడు దల చేసిన మేకర్స్ తాజాగా కథానాయికగా మలయాళ బ్యూటీ అనస్వర రాజన్‌ను పరిచయం చేశారు. మంగళవారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ‘చంద్రకళ’గా అనస్వర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్; డీవోపీ: ఆర్ మాధీ; ఆర్ట్: తోట తరణి.