calender_icon.png 10 November, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి

10-11-2025 01:41:42 AM

తుర్కయంజాల్, నవంబర్ 9: పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం, వారిలో ఆత్మస్థుర్యైం నింపేందుకు కృషి చేస్తామని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ర్ట నాయకులు పేర్కొన్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి రాగన్నగూడలోని వశిష్ట మోడల్ హైస్కూల్‌లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ %ఞ% రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రథమ మహాసభ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కూరపాటి నాగేశ్వరరావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు మచ్చ రంగయ్య, డాక్టర్ ఎల్. అరుణ, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ ప్రధాన కార్యదర్శి మడ్డూరి కృష్ణారావు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూపెన్షనర్లకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించారు. అనేకమంది కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ శాఖల్లో పనిచేసి రిటైర్ అయిన  పెన్షనర్లు ఉన్నారని, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించామన్నారు. వారిలో మానసికస్థుర్యైన్ని నింపడం కోసం పనిచేస్తామన్నారు.

అనంతరం తుర్కయంజాల్ ఏరియా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కె.బలరాం, ఉపాధ్యక్షులుగా రఘురామయ్య, విజయలక్ష్మి, రవికుమార్, అమర్ నాథ్, ప్రధాన కార్యదర్శి కె.సాయిలు,  కోశాధికారిగా కె.నాగయ్య, కార్యదర్శులుగా ముత్యాలు, కాశిరెడ్డి, సీతారాం రెడ్డి, గోపాల్, కార్యవర్గ సభ్యులుగా తిరుపతయ్య, రమేష్, భిక్షమయ్య, పి. కృష్ణయ్య  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.