calender_icon.png 21 July, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చంద్రబాబు వర్సెస్ లోకేశ్

20-07-2025 12:41:10 AM

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు వర్సెస్ ఆయన కొడుకు, ఏపీ మంత్రి లోకేశ్ అన్నట్టు నడుస్తోంది. వినడానికి కొంత విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. బనకచర్ల అంశం తెలంగాణ రాజకీయాల్లో కుదుపేస్తోంది. ఢిల్లీలో జరిగిన ఇరు రాష్ట్రాల సీఎంల భేటీలో రేవంత్‌రెడ్డి చంద్రబాబుతో కలసి సమావేశంలో పాల్గొనడం, బనకచర్ల ఎజెండాలో లేదని పేర్కొనడంతో ఈ అంశా న్ని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తోంది.

తెలంగాణకు రావాల్సిన గోదావరి జలాలను తన గురువు చంద్రబాబుకు గురుదక్షిణగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారంటూ గులాబీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ మరునాడే సీఎం రేవంత్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఏపీ మంత్రి లోకేశ్‌తో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రహాస్యంగా భేటీ అయ్యారని, ఎందుకు సీక్రెట్‌గా కలిశారో చెప్పాలంటూ కామెంట్ చేశారు. ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పెట్టేందుకు హస్తం పార్టీ నేతలు ఈ అంశాన్ని వాడుకుంటున్నాయి. దీంతో బనకచర్ల ఇష్యూ కాస్త చంద్రబాబు అంశంగా మారిందని పొలిటికల్ సర్కిల్ టాక్.    

తమ్మనబోయిన వాసు