calender_icon.png 21 July, 2025 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ప్రజా పాలన

20-07-2025 12:39:19 AM

కాంగ్రెస్ సీనియర్ నేత మురళీధర్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 19 (విజయక్రాంతి): మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన పరుగులు పెడుతున్నదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె మురళీధర్‌రెడ్డి కొనియాడారు. శనివారం ఆయన మీడియాతో మా ట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సీఎం రేవంత్‌రెడ్డి 60 వేల ప్రభుత్వ ఉద్యోగ  నియామకాలు పూర్తి చేశారని, ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవ త్సరాలు పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానని బాధ్యత తీసుకున్నారని చెప్పారు.

అర్హులైన లబ్ధిదారులకు 5 లక్షలకు పైగా నూతన రేషన్ కార్డుల పంపిణీ చేస్తూ, మహి ళా సంఘాలకు వడ్డీ లేని రు ణాలు, మహిళలకు ఉచిత బస్సు, సిలిండర్ రాయితీ, ఇందిరమ్మ ఇండ్లు, రైతుబంధు, పేదల కడుపులు నింపాలన్న లక్ష్యంతోనే సన్న బియ్యం ఇచ్చి పేద ప్రజల మన్ననలు పొందుతున్నారని కొనియాడరు. సీఎం రేవంత్‌ఖు వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ ఆశీస్సులు కలిగి నిండు నూరేళ్లు ఆయురా రోగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటున్నాను కే మురళీధర్‌రెడ్డి తెలిపారు.