25-11-2025 12:00:00 AM
-ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
బూర్గంపాడు, నవంబర్ 24,(విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పండించిన పం టలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగో లు కేంద్రాల్లోనే విక్రయించాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రైతులకు సూచించా రు. మండలంలోని అంజనాపురం గ్రామం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవా రం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భం గా మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు విక్రయించి మోస పోవద్దన్నారు.
పినపాక నియోజకవర్గంలో రైతుల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుని, వారికి న్యాయమైన ధర, సరైన వసతులు, సమయానికి మద్దతు అందించేందుకు రూ పొందించిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు. రైతు ల ధాన్యం ఒక్క గింజ కూడా వ్యాపారుల చేతుల్లో నష్టపోకుండా నేరుగా ప్రభుత్వ కొ నుగోలు కేంద్రాల ద్వారా తీసుకుంటామని స్పష్టం చేశారు. తూకాలు, చెల్లింపులు పూ ర్తిగా పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపా రు.
రైతులు గంటల తరబడి లైన్లలో వేచి ఉం డకుండా వేగవంతమైన కొనుగోలు చర్యలు చేపడతామని అన్నారు. మద్దతు ధర (ఎం ఎస్ పి) చెల్లింపులు సత్వరమే రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేలా అధికారులు పని చేయాలని ఆదేశించారు. అనంతరం జింకలగూడెం గ్రామంలో ప్రయాణికుల సౌకర్యా ర్థం బస్ షెల్టర్ నిర్మాణానికి భూమి పూజ చే శారు.
ఈ బస్ షెల్టర్ నిర్మాణం పూర్తయితే విద్యార్థులు, ఉద్యోగులు, రోజువారీ ప్రయాణికులు, వృద్ధులు అందరికీ ఎంతో ఉప యోగపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో బి సి ఎస్ ఓ ప్రేమ్ కుమార్, ఏడిఏ తాతారా వు, ఎమ్మార్వో ప్రసాద్, ఎంపీడీవో జమలా రెడ్డి, డీసీఎంఎస్ అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్ స్వరూప, డీసీఎంఎస్ ఏరియా బిజినెస్ మేనేజర్ రవి, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.