01-05-2025 01:18:07 AM
రిషికేష్, ఏప్రిల్ 30: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే చార్‌ధామ్ యాత్ర బుధవారం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మొదలయింది. బుధవారం అక్షయతృతీయను పురస్కరించుకుని గంగోత్రి, యమునోత్రి ధామ్‌ల ద్వారాలు తెరిచారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రి పుష్కర్‌సింగ్ ధామి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఈ యాత్ర జరుగుతుంది. యాత్ర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని గంగో త్రి, యమునోత్రి దేవాలయాలను సాంప్రదాయబద్ధ మంత్రోచ్ఛరణలతో తెరిచారు. ‘అక్షయతృతీయ సందర్భంగా గంగోత్రిధామ్‌లో పూజలు చేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది. కపదోద్కటన్ (గేట్లు తెరిచే కార్యక్ర మంలో పాల్గొన్నాను.
ప్రధాని మోదీ పేరు మీద గంగమ్మ తల్లికి మొదటి పూజ చేశాను.’ అని ఉత్తరాఖండ్ సీఎం ధామి ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకోగా.. కేదార్‌నాథ్ ఆలయం మే 2న, బద్రీనాథ్ ఆలయం మే 4వ తేదీన తెరచుకోనున్నాయి. ఈ నాలుగు ఆలయాల సందర్శనను చార్‌ధామ్ యా త్రగా అభివర్ణిస్తారు.
పేర్లు నమోదు చేసుకున్న 22 లక్షల పైచిలుకు భక్తులు
రిషికేష్‌లో ఏర్పాటు చేసిన రిషికేష్ ట్రాన్సిట్ క్యాంప్‌లో చార్‌ధామ్ యాత్ర కో సం 22 లక్షల పైచిలుకు భక్తులు పేర్లు నమో దు చేసుకున్నారు. గతేడాది చార్‌ధామ్ యా త్రలో 48 లక్షలకు పైగా భక్తులు ఈ యా త్రలో పాల్గొన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. జిల్లా పర్యాటక అధికారి ప్రజాపతి మాట్లాడుతూ.. భక్తుల భద్రత కొరకు ప్రత్యేక సెక్యూ రిటీ మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
‘దివ్యాంగులు, వృద్ధులు, విదేశీ భక్తుల సౌకర్యం కోసం మరో 20 ఉచిత రిజిస్ట్రేషన్ కౌంటర్లను జిల్లా టూరిజం కార్యా లయంలో ఏర్పాటు చేశాం. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉన్నాయి. యాత్రికుల భద్రత, శ్రేయస్సు కొరకు అదనపు భద్రతా బలగాలను మోహరించాం. ప్రత్యేక ఏర్పాట్లు చేశాం.’ అని వెల్లడించారు.
ఇటీవలే పహల్గాంలో పర్యాటకుల మీద జరిగిన భయంకర ఉగ్రదాడి నేపథ్యంలో ఈ యాత్రకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు వాటిల్లకుండా భారీ భద్రతను ఏర్పా టు చేశారు. పోలీసు భద్రతతో పాటు సీసీటీవీ కెమరాలను సైతం అమర్చారు. ట్రాఫిక్ నిర్మూలన కోసం డ్రోన్లను వాడు తూ.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.