23-09-2025 01:36:28 AM
నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్
ముషీరాబాద్, సెప్టెంబర్ 22(విజయక్రాంతి): వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ బిల్లును తక్షణమే రద్దు చేయాలని నేషనల్ కో- ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేష న్(ఎన్ సీసీపీఏ) ప్రధాన కార్యదర్శి ఎన్. సోమయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా స మావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు పి. యుగంధర్, కోశాధికారి ఎం. అర్జున్ ల తో కలసి సోమయ్య మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక బిల్లుతో పాటు పెన్షన్ బిల్లు ప్రవేశ పెట్టి, రాజ్యాంగంలోని పెన్షన్ రూల్స్ ఆర్టికల్ 14 ను అతిక్రమించారని ఆరోపించారు. 8వ వేతన కమిషన్ ను వెంటనే నియ మించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రికమెండేషన్స్ ను వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ పెన్షనర్స్ పెన్షన్ ను 2017 నుండి అప్ గ్రేడ్ చేయాలని, ఈపీఎఫ్ కనీస పెన్షన్ రూ.9 వేలకు పెంచాలని కోరారు.
వయో వృద్దులకు ప్రయాణ కన్వేషన్స్ తిరిగి పునరుద్దించాలన్నారు. బ్యాంకు పెన్షనర్స్ పెన్షన్ కూడా అప్ గ్రేడ్ చేయాలని, ఎన్.సీ.పీ.ఎస్, యూపీఎస్ ను వెంటనే రద్దు చేయాలన్నారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎన్ సీసీపీఏ ప్రతినిధులు శివకుమార్, రామచంద్రుడు, శివలింగం, భార్గవచారి, వై.వి.సుధవన్ కుమార్, ఎస్. మోహన్ దాస్, డబ్ల్యూ. సుధాకర్, బి.నర్సింహ, ఎన్. సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.