18-11-2025 07:54:11 PM
మంథని,(విజయక్రాంతి): బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (బీసీ జేఏసీ)పెద్దపల్లి జిల్లా కో–కన్వీనర్‌గా ముత్తారం మండలంలోని పోతారం గ్రామానికి చెందిన చెల్కల యుగేందర్ యాదవ్ నియమితులయ్యారు. జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో బీసీ జేఏసీ పెద్దపల్లి జిల్లా చైర్పర్సన్ దాసరి ఉష, కన్వీనర్ సలేంద్ర కొమురయ్య యాదవ్ చేతుల మీదుగా నియామకం అందజేశారు.
జెఏసీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు బీసీ హక్కులు, సంక్షేమ కార్యక్రమాలు, రాజకీయ ప్రారంభ, సామాజిక న్యాయం కోసం జేఏసీ చేపట్టబోయే ఆందోళనలు, అవగాహన కార్యక్రమాల్లో జిల్లా స్థాయిలో సమన్వయాన్ని బలోపేతం చేయడానికి కొత్త కమిటీని నియమించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా యుగేందర్ యాదవ్ మాట్లాడుతూ... బీసీ వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉంటానని, ప్రభుత్వాలు అమలు చేయాల్సిన హక్కుల కోసం ప్రజా ఉద్యమాలు బలోపేతం చేస్తానని అన్నారు. తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జెఏసీ నాయకత్వానికి యుగేంధర్ కృతజ్ఞతలు తెలిపారు.