calender_icon.png 18 November, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్తయిన ఇళ్ల పరిశీలన

18-11-2025 07:53:26 PM

కొండపాక: కొండపాక గ్రామానికి చెందిన గడీల బాలవ్వ ఇందిరమ్మ ఇల్లును పూర్తి చేసుకోవడంతో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంఆర్వో, మండల ఏఈ, గ్రామ కార్యదర్శి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వాసరి లింగారావు, ఏఎంసీ వైస్ చైర్మన్ పట్టా పరుశురాములు తదితరులు ఇంటిని సందర్శించారు. అధికారులు అనంతరం ఇందిరమ్మ మోడల్ హౌస్‌ని పరిశీలించారు. రాష్ట్రంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు వేగంగా మంజూరు చేసి నిర్మాణంలో పర్యవేక్షణ చేస్తోందని పలువురు తెలిపారు. మండలంలో అనేక ఇండ్లు పూర్తి చేసుకొని ఎన్నో కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొయ్యడ వెంకటేశం, గజవెల్లి సుదర్శన్, ఎంపీటీసీ లఫోరం మాజీ అధ్యక్షుడు సాయిబాబా, మాజీఎంపీటీసీ అంజయ్య, మాజీ ఎంపీపీ కనకరాములు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు  ఇతరులు పాల్గొన్నారు.