calender_icon.png 11 January, 2026 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధైర్య పడకండి అండగా ఉంటాం

10-01-2026 08:11:09 PM

చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన లిక్కి నవీన్ గౌడ్ 

భూత్పూర్: మున్సిపాలిటీ పట్టణంలోని 4వ వార్డుకు చెందిన వంక కాళ్ల శంకరయ్య భార్య కళావతమ్మ అనారోగ్యం కారణంగా మహబూబ్నగర్ లోని ఎస్విఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్ ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎలాంటి సహాయం కావాలన్నా నేనున్నానని భరోసా బాధితులకు భరోసనిచ్చారు. అనంతరం సంబంధిత డాక్టర్ తో ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మెరువైన వైద్యం అందించాలని కోరారు. రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పట్టణంలోని ఒకటవ వార్డుకు చెందిన ఆంగోత్ చంద్రు భార్య రోడ్డు ప్రమాదంలో గాయపడి పట్టణంలోని ఎంఐసియు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గడ్డం యాదయ్య, పరశురాం  తోపాటు తదితరులు ఉన్నారు.