calender_icon.png 29 January, 2026 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెన్నూర్‌ను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

28-01-2026 12:52:45 AM

కార్మిక శాఖ మంత్రి వివేక్ 

చెన్నూర్, జనవరి 27: రాష్ట్రంలోనే చెన్నూర్‌ను మోడల్ మున్సిపాలిటీని తీర్చిదిద్దుతానని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం చెన్నూరు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. చెన్నూర్ లోని 14వ వార్డు లో ఇటీవలనే రూ. 95 లక్షల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించామని, ఇప్పటికే ఈ వార్డులో సుమారు రూ. 3 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

గత ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు జరుగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వార్డుల్లోని అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ లు చేపట్టామన్నారు. మన మున్సిపాలిటీలో ఇంకా ఎక్కువ అభివృద్ధి పనులు జర గాలంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని, అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, త్వరలోనే చెన్నూరు లో 100 పడకల ఆసుపత్రి ప్రారంభం చేస్తామన్నారు.

సోమనపల్లిలో రూ. 250 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతుందని, చెన్నూరు లో యువకుల ఉపాధి కోసం ఏటీసీకి శంకుస్థాపన చేశామన్నారు. ఎంఎల్‌ఏ గా గెలిచిన అనంతరమే సింగరేణిలో 80 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించానని, జైపూర్ పవర్ ప్లాంట్ లో 850 మెగా వాట్ల ప్లాంట్ కు వచ్చే నెలలో శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుందన్నారు. చెన్నూర్‌లోని కాలనీల్లో ఆటోలు కూడా వెళ్లలేని పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు ఆ సమస్య తీరనుందన్నా రు. బీఆర్‌ఎస్ పార్టీ అన్ని ఎన్నికల్లో వరుసగా ఓడి పోతుందనే ఫ్రస్ట్రేషన్ లో తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.