01-10-2025 02:12:06 AM
నియామక పత్రాన్ని అందజేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): తెలంగాణ బిసి అసోసియేషన్ అష్ట కార్మిక అధ్యక్షుడిగా చెరుకు మణికంఠ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం విద్యానగర్లోని బీసీ భవన్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య మణికంఠకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మణికంఠ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర కార్మిక అధ్యక్షునిగా నియమించిన కార్మికులందరికీ ఏ ఇబ్బంది వచ్చినా అన్ని రకాల ముందుండి తన వంతుగా శక్తివంతన లేకుండా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
తనపై నమ్మకం ఉంచి కార్మిక శాఖ అధ్యక్షుడిగా నియమించిన ఎంపీ ఆర్. కృష్ణయ్య కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి కృషి చేసిన సహచర బీసీ నాయకులు అందరికీ పేరుపేరునా ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం పాల్గొన్నారు.