15-05-2025 01:56:02 AM
ఆందోళనలో కస్టమర్స్
కుత్బుల్లాపూర్, మే 14(విజయ క్రాంతి): ప్రగతినగర్ లో ఓ జూవెలర్స్ షాప్ యజమాని ఘరానా మోసం చేశాడు. ప్రగతినగర్ లో చేతన్ జూవెలర్స్ అనే పేరుతో నగల దుకాణం గత 15 సంవత్సరాల నుండి నడిపిస్తున్నాడు.ప్రగతినగర్‌తో పాటు,కూకట్పల్లి లోని కేపీహె చ్బీ కాలనీలో చేతన్ జూవెలర్స్ పేరుతో మరో జూవెలర్స్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా జూవెలర్స్ వ్యాపారం చేస్తూ నగలు కుదువా పెట్టుకుని వడ్డీకీ డబ్బులు ఇచ్చే వాడు.
ఈ క్రమంలో చేతన్ జూవెలర్స్ యజమాని నితీష్ జైన్ గత వారం రోజుల నుండి షాప్ మూసివేసి సుమారు రూ. 10 కోట్ల విలువ గల నగలతో పరారయినట్లు సమాచారం. జూవెలర్స్ షాప్ లో నగలు తాకట్టు పెట్టిన ప్రజలు ప్రతి రోజూ జూవెలర్స్ షాప్ తీస్తాడేమో అని ప్రతి రోజూ షాప్ కీ రావడం,నిత్యం అతనికీ ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కస్టమర్స్ ఆందోళన చెందుతున్నారు.అయితే ఇదే విషయంపై బాచుపల్లి ఇన్స్పెక్టర్ ఉపేందర్ ను వివరణ కోరగా చేతన్ జూవెలర్స్ షాప్ పై పోలీస్ స్టేషన్ లో ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపాడు.