calender_icon.png 15 May, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు ప్రక్రియలు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

15-05-2025 01:56:52 AM

  1. సోమలగూడెం, తుంగారం కొనుగోలు కేంద్రం ఇన్చార్జిలు సస్పెండ్
  2. అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్

భద్రాద్రి కొత్తగూడెం మే 14 (విజయ క్రాంతి): జిల్లాలో దాన్యం సేకరణలో ఎవరై నా వారి విధులు పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ టి వేణుగోపాల్ హెచ్చరించారు. జిల్లాలో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఆయన బుధవారం ఆయన మాట్లాడు తూ చండ్రుగొండ, పాల్వంచ మండలాల్లో ధాన్యం సేకరణలో వచ్చిన ఫిర్యాదులు పై విచారణ నిర్వహించామన్నారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాల్వంచ మండలం సోమలగూడెం ,చంద్రుగొండ మండలం తుంగారం (PACS) ధాన్యం కొ నుగోలు కేంద్రం ఇన్చార్జిలను సస్పెండ్  చేసినట్లు తెలిపారు. ధాన్యం సేకరణలో ఎటు వంటి నిర్లక్ష్యం , పొరపాట్లు చేసిన కఠిన చర్య లు తీసుకుంటామన్నారు. మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తే వారిపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు.