29-10-2025 12:37:28 AM
కాగజ్‌నగర్, అక్టోబర్ 28 (విజయక్రాం తి): కాగజ్ నగర్ పట్టణంలోని ఎస్పిఎం మైదానంలో ఉత్తర భారతీయులు ప్రతి ఏటా కార్తీక మాసంలో నిర్వహించే ఛట్ పూజ లు మంగళవారం ముగిశాయి. ప్రతి ఏటా కార్తీక మాసంలో నిర్వహించే ఛట్ పూజా కార్యక్రమంలో ఉత్తర భారతీయులు అత్యంత నిష్టతో సూర్యభగవానునికి పూజలు చేసి,నీటిలో ఉండి సూర్యభగవానుని ప్రార్థిస్తారు.
ఈ సందర్భంగా మంగళవారం వేకు జామున ఎస్‌పిఎం క్రీడా మైదానం కొలనులో నిలబడి పూజలు చేశారు. సూర్యుడు ఉదయించిన తర్వాత నైవేద్యాలు సమర్పించారు. అనంతరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, ఎస్వీఎం ప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.