ప్రెస్‌క్లబ్‌లో నేడు ఛాయా చిత్ర ప్రదర్శన
ఉత్తమ ఫొటోగ్రాఫర్లకు బహుమతుల ప్రదానం
హాజరుకానున్న మంత్రి పొంగులేటి, ప్రముఖులు
ముషీరాబాద్, ఆగస్టు 18 : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫొటో జర్నలిస్టుల సంఘం నిర్వహిం చిన రాష్ట్రస్థాయి న్యూస్ ఫొటో కాంపిటీషన్ తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల నుండి దాదాపు 100 మంది ఫోటో జర్నలిస్టులు తమ ఎంట్రీలను పంపారని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనుమల్ల గంగాధర్, కేఎన్ హరిలు తెలిపారు. ఆదివారం వారు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన న్యూస్ ఫొటో కాంపిటీషన్‌ొో2024 ఛాయాచిత్ర ప్రదర్శనలో సీనియర్ జర్నలిస్టు, సీఎం పీఆర్‌ఓ బీ అయోధ్యరెడ్డి, సీనియర్ జర్నలిస్టు సీహెచ్ సుశీల్ రావు, సీనియర్ ఫొటో జర్నలిస్టు హెచ్ సతీష్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి ఉత్తమ వార్త చిత్రాలను ఎంపిక చేశారు.
ప్రథమ బహుమతి రూ.10 వేలు, మహిమల భాస్కర్ రెడ్డి వెలుగు (సిద్దిపేట), ద్వితీయ బహుమతి రూ.8వేలు సురేంద్ర డెక్కన్ క్రానికల్ (హైదరాబాద్), తృతీయ బహుమతి రూ.5 వేలు ఏ తరుణ్ టైమ్స్ ఆఫ్ ఇండియా (హైదరాబాద్), రూ.2 వేల చొప్పున 25 కన్సోలేషన్ బహుమతులు పి మోహన్ చారి, సాక్షి(హైదరాబాద్), ముచ్చర్ల విజయ్, ఆంధ్రజ్యోతి (నల్లగొండ), రాఘవేందర్, ఈనాడు (హైదరాబాద్), కే జయకృష్ణ ఈనాడు(హైదరాబాద్), బీ శివ ప్రసాద్ సాక్షి (సంగారెడ్డి), జీ శ్రీనివాస్ నమస్తే తెలంగాణ(హైదరాబాద్), కే శ్రావణ్ కుమార్ ఈనాడు (సిద్దిపేట), మహ్మద్ ఆరీఫ్ ది హిందూ (సంగారెడ్డి), యాదగిరి, ఈనాడు (హైదరాబాద్) పీ శ్రీధర్, ప్రజాపక్షం(కరీంనగర్), సూర్య శ్రీధర్ తెలంగాణ టుడే (హైదరాబాద్), టీ కిషోర్ సింగ్ హిందీ మిలాప్ (హైదరాబాద్), జీఎన్ రావు ది హిందూ (ఖమ్మం), గోపీ నమస్తే తెలంగాణ (హైదరాబాద్), అశోక్ యాదవ్ ఆంధ్రజ్యోతి (హైదరాబాద్), సీ బషీర్ ఈనాడు (హైదరాబాద్), వీ భాస్కర చారీ సాక్షి (మహబూబ్‌నగర్), పీ సింహాచలం ఈనాడు (ఆదిలాబాద్), డీ సుమన్ రెడ్డి టైమ్స్ ఆఫ్ ఇండియా (హైదరాబాద్), ఆవుల శ్రీనివాస్ ఈనాడు (హైదరాబాద్), శ్రీనివాస్ శెట్టి ది హన్స్ ఇండియా (హైదరాబాద్), కే.దుర్గారావు డెక్కన్ క్రానికల్ (హైదరాబాద్), ఏ.తరుణ్ టైమ్స్ ఆఫ్ ఇండియా (హైదరాబాద్), జ్వాలా కోటేశ్వర్ రావు ఆంధ్రజ్యోతి (హైదరాబాద్), బందగీ గోపి నమస్తే తెలంగాణ (మహబూబ్‌నగర్) ఎంపికయ్యారు. ఈ ఛాయా చిత్ర ప్రదర్శనను సోమవారం రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే విరాహత్ అలీ, రామనారాయణ తదితరులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.






