16 June, 2026 | 4:27 AM

సుప్రీంలో కవితకు మళ్లీ నిరాశే

19-08-2024 12:55 AM

బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 20కి వాయిదా

మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ

న్యూ ఢిల్లీ, ఆగస్టు 18:  లిక్కర్ స్కాం కేసు లో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయిచిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశే ఎదురైంది. దర్యాప్తు సంస్థల వాదనలు విన్న తర్వాతనే బెయిల్ పిటిషనపై తమ నిర్ణయం వెల్లడిస్తామని జస్టిస్ బీఆర్.గవాయి, జస్టిస్ కేవీ విశ్వ నాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్ప ష్టం చేసింది. లిక్కర్ కేసులో తనకు బెయిల్ నిరాకరిస్తూ జూలై 1న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కవిత వేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు ఆగస్టు 12న సీబీఐ, ఈడీ నుంచి స్పందన కోరింది. ఆగస్టు 12న జరిగిన వాదనల సందర్భంగా.. కవిత ఐదు నెల ల కస్టడీలో ఉన్నారని ఇప్పటికే సీబీఐ, ఈడీ ఆమెపై చార్జిషీట్, ప్రాసిక్యూషన్ ఫిర్యాదులను దాఖలు చేశాయని వాదిస్తూ బెయిల్ కోసం కవిత తరఫు న్యాయవాది కోర్టును కో రారు. 

మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీం మధ్యంతర బెయిల్ మంజూరు చే సిందని, అలాగే లిక్కర్ కేసులో సిసోడియా కు కూడా సుప్రీం బెయిల్ మంజూరు చేసిందని అన్నారు. సెక్షన్ 45 ప్రకారం ఓ మహి ళగా కవితకు కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న అనంతరం కవిత బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది.