27-09-2025 12:32:18 AM
టేకులపల్లి, సెప్టెంబర్ 26,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్మెంట్), చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బాదావత్ వెంకన్నశుక్రవారం ఇల్లందు ఏరియా లోని కోయగూడెం ఓసిలోని స్థలాలను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను యస్. ఓ. టూ జి.యం రామస్వామిని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమం లో కోయగూడెం మేనేజర్ శ్రీనివాస్, అడిషనల్ మేనేజర్ వి.బ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు.