27-09-2025 12:33:28 AM
ములకలపల్లి, సెప్టెంబర్ 26 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వా రావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండల కేంద్రంలో అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారె ఆదినారాయణ ఆదేశాల మేరకు ములకలపల్లి మండలానికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను కాంగ్రె స్ మండల అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్ రా వు శుక్రవారం పంపిణీ చేశారు .
9 మందికి రూ3 లక్షలు చెక్కుల రూపంలో అందజేశారు.ములకలపల్లి మండల పరిధిలోని మండల ప్రజలు ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులలో చూ పించుకున్న బిల్లులు గండుగులపల్లి క్యాంప్ ఆఫీస్ లో అందజేయాల్సిందిగా సూచించారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఎప్పు డు ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండ ల నాయకులు తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్ కారం సుధీర్, అశ్వారావుపేట నియోజకవర్గ యూత్ వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి సుమిత్, మేకల నారి,కటికనేని ఆదిత్య,బాబి,తదితరులు పాల్గొన్నారు.