26-08-2025 12:31:35 AM
తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఘటన
తంగళ్లపల్లి ఆగస్టు 2౫ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ఓ చిన్నారికి డెంగ్యూ సోకి మృతి చెందింది. మండల కేంద్రానికి సారుగు బాలయ్య, సంధ్యలకు చెందిన సహస్ర(౮) స్థానిక ఓ ప్రైవేట్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతుంది. ఆ బాలికకి మూడు రోజుల క్రితం డెంగ్యూ జ్వరం వచ్చింది. దీంతో తల్లిదండ్రులు తమ బిడ్డను సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. అక్కడ ఆమె పరిస్థితి మెరుగు కాకపోవడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రి చేర్పించి చికిత్స చేయించారు.
పరిస్థితి విషమించి ఆ చిన్నారి సోమవారం మృతి చెందింది. కాగా మండల కేంద్రంలో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. చెత్త చెదారం పేరుకుపోతుండడంతో సీజనల్ వ్యాధులో పాటు డెంగ్యూ లాంటి జ్వరాలు ప్రబలుతుండడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా పంచాయతీ సిబ్బంది స్పందించి పారిశుధ్యం మెరుగుకు,దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలుతీసుకోవాలని పలువురు కోరుతున్నారు.