26-11-2025 12:00:00 AM
నూతనకల్ నవంబర్ 25 మండల పరిధిలోని మాచిన పల్లి గ్రామంలో మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం అవగాహనా కార్యక్రమo నిర్వహించడం జరిగింది. మీ చుట్టుపక్కల ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లయితే వెంటనే చిల్డ్రన్స్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 కీ కాని 100 నెంబర్ కీ కానీ ఫోన్ చేసి సమాచారం ఇవ్వగలరని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐసిడీఎస్ సూపరవైజర్ సూర్యకళ ఐసీపీస్ శ్రీలక్ష్మి, వంశీ మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ వినోద్, అంగన్వాడీ టీచర్లు, పంచాయితీ సెక్రెటరీ ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.