26-11-2025 12:00:00 AM
కోదాడ, నవంబర్ 25: జాతీయ సమైక్యత, దేశభక్తి ని పెంపొందించడం, ప్రత్యేకించి జాతిని ఏకీకృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర మరువలేనిదని జాతీయ స్థాయిలో జరిగే యూనిటీ మార్చ్ లో కూడా పాల్గొనాలని పలువురు పిలుపునిచ్చారు.
మంగళవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి ని పురస్కరించుకొని ప్రజలలో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించేందుకుగాను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ మరియు ఎన్‌ఎస్‌ఎస్ సంయుక్తంగా జిల్లా యంత్రాంగం,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కోదాడ జడ్పీ హెచ్ ఎస్ మైదానంలో ఏర్పాటు చేసిన సర్దార్ 150 యూనిట్ మార్చ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన పటేల్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఆ తర్వాత సమైక్యత ర్యాలీని ప్రారంభించారు. ఈ సమైక్యతా ర్యాలీ లో కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు భారీగా పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ, హ్యుమానిటీస్ విభాగాదిపతి రమేష్, అధ్యాపకులు నరహరి, శ్రీను విద్యార్థినులు పాల్గొన్నారు.