calender_icon.png 22 November, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటికీ బాల్య వివాహాల నమోదు ఆందోళనకరం

22-11-2025 02:06:04 AM

-పిల్లల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి

-రాష్ట్ర చైల్ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్‌రెడ్డి

-ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా అధికారులతో సమీక్ష...

ఆదిలాబాద్, నవంబర్ 21 (విజయక్రాం తి):  పిల్లల రక్షణ, భద్రత, విద్య, ఆరోగ్యం, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పర్యటనలో బాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, నిర్మల్ జిల్లా  అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ లతో కలిసి బాలల భద్రత, బాల్య వివాహాల నియంత్రణ, పాక్సో చట్టం అమలు, చైల్ ప్రొటెక్షన్ వ్యవస్థపై అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్య, ఆరోగ్య విభాగాల పురోగతిని ఈ సందర్భంగా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

అంతకుముందు పట్టణ కేజీబీవి, రిక్షా కాలనీ లోని అంగన్వాడీ కేంద్రా న్ని కమిషన్ ఛైర్పర్సన్, బృందం సభ్యులు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్పర్సన్  మాట్లాడుతూ, పిల్లలకు గౌరవంతో జీవించే హక్కులు ఉన్నాయని, ఈ హక్కులను కాపాడటం ప్రభు త్వం మాత్రమే కాకుండా సమాజం మొత్తం పాలుపంచుకోవాల్సిన బాధ్యత అని స్పష్టం చేశారు. జిల్లాలో ఇంకా బాల్య వివాహాలు నమోదవడం ఆందోళనకరమని పేర్కొన్న ఆమె, సమాచారం వచ్చిన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గ్రామస్థాయిలో పర్యవేక్షణ బలోపేతం చేయాలని, బాల్య వివాహ నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించారు. అలాగే హాస్టళ్లు, ఆశ్రమాలు, పాఠశాలల్లో పిల్లలపై వేధింపులు, దుర్వినియోగం, నిర్లక్ష్యంపై జీరో టాలరెన్స్ విధానంతో వ్యవహరించాలని సూచించారు. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వినియోగం పెరిగిన నేపథ్యంలో పిల్లలు సైబర్ మోసాలు, అనారోగ్యకర ఆన్లైన్ గేమ్స్ ప్రభావానికి గురవుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ఆన్లైన్ ప్రవర్తనను గమనించాలని, వారు ఏ యాప్స్ వాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే అంశాలపై అవగాహన తప్పనిసరి అని సూచించారు.

పోక్సో చట్టం అమలు, బాల కార్మిక నిర్మూలన, సీపీ ఎస్ బలోపేతంపై అన్ని శాఖలు సమన్వయం తో పనిచేయాలని సూచించారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. జిల్లాలో చిన్నారుల రక్షణకు సమగ్ర చర్యలు చేపడుతున్నట్టుగా తెలిపారు. ఆపరేషన్ స్త్మ్రల్, ఆపరేషన్ ముస్కా న్ ద్వారా ఇప్పటి వరకు మొత్తం 354 మంది చిన్నారులను గుర్తించి, డ్రాప్‌అవుట్ పిల్లలను బడిలో చేర్పిచే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. షీ టీమ్, భరోసా సెంటర్, ఆరోగ్య పాఠశాల కార్యక్రమం ద్వారా కళాజాత బృందాల సహాయంతో అవగాహనా కార్యక్రమాలు నిర్వ హిస్తున్నట్లు పేర్కొన్నారు.

జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణ కోసం పటిష్ట చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు 83 పోక్సో కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. బడిబాట ప్రోగ్రాం కింద కెజీబీవీలు, పాఠశాలలు, భవిత కేంద్రాల్లో మరుగుదొడ్లు, భవనాలు, పెయింటింగ్ వంటి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. 70 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని కలెక్టర్ వివరించారు. 

ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు వందన గౌడ్, అపర్ణ, సరిత, ప్రేమలత, వచన్ కుమార్, ఆదిలాబాద్, నిర్మల్ ఏఎస్పీలు సురేందర్ రావు, అవినాష్ కుమార్, జిల్లా సం క్షేమ అధికారి మిల్కా, డిఎమ్ అండ్ ఎచ్ ఓ రాథోడ్ నరేందర్, నిర్మల్ డిఇఓ బోజన్న, ప్రోగ్రాం కోర్డినేటర్ డా.సౌమ్య, విద్యా, సంక్షే మ, వైద్యారోగ్య, పోలీస్, శాఖల అధికారులు, సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు.