calender_icon.png 22 November, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లిదండ్రులను ఇబ్బందిపెడితే కఠిన చర్యలు

22-11-2025 02:04:15 AM

-వయోవృద్ధుల సంక్షేమ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి

-కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, నవంబర్ 21 (విజయక్రాం తి): తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్ లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా, డిసిపి ఎగ్గడి భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస రావు, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్ర మంలో వయోవృద్ధులకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, పరిష్కరిస్తున్నామన్నారు. ఫిర్యాదుదారులకు రక్ష ణ కల్పించడానికి ఎవరూ లేని పక్షంలో ఓల్ ఏజ్ హోమ్స్, స్వచ్చంధ సంస్థల సహాయంతో సంరక్షించడం జరుగుతుందని, ట్రిబ్యునల్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి సహాయం అందిసున్నామనీ, వయోవృద్ధుల దరఖాస్తులను పోలీసు, రెవెన్యూ సిబ్బంది సానుకూల దృష్టితో చూడవలసిన అవసరం ఉందన్నారు.

వయోవృద్ధులు www.tgseniorcitizens.gov.in వెబ్ సైట్ ద్వారా వారి సంరక్షణకు సంబంధించిన దరఖాస్తు, ట్రిబ్యునల్ కు అప్పీలు, ఎవిక్షన్ ఆర్డర్, అప్పిలేట్ అథారిటీకి దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ వెబ్ సైట్ ద్వారా సీనియర్ సిటిజన్స్ యాక్ట్ చట్టాన్ని డౌన్ లో డ్ చేసుకోవచ్చని తెలిపారు. వయావృద్ధులు శారీరకంగా, మానసికంగా కలిగే ఇబ్బందులను ఫిర్యాదు చేయవచ్చని, రెవెన్యూ, పోలీ స్, సంక్షేమ శాఖల సమన్వయంతో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.

అనంత రం జాతీయస్థాయిలో జల సంరక్షణలో భాగంగా అవార్డు పొందిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు శాలువాతో సన్మానించారు. వయోవృద్ధులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వయోవృద్ధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.