calender_icon.png 10 August, 2025 | 12:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలి

09-08-2025 10:39:57 PM

సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

సూర్యాపేట (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లాల్సిన బాధ్యత యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై ఉందని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి(Market Committee Chairman Koppula Vena Reddy) అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో నాటినుండి నేటి వరకు యూత్ కాంగ్రెస్ కు పార్టీ అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టి ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వాటిని ప్రజలకు వివరించడంలో విఫలము అయ్యామన్నారు.

కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ తో ఏర్పడిన 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్టీ చేసిన కృషిని ప్రజలకు వివరించడంలో కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ చోరవ చూపకపోవడంతోనే ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నారు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల అప్పుల్లో నెట్టి ప్రజాధనాన్ని దోచుకుందని ఆరోపించారు. గత పదేళ్ళలో బిఆర్ఎస్ పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో ప్రజలకు వివరించాలన్నారు. సూర్యాపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేసిన అభివృ‍ద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ అధ్యక్షుడు ఎలిమినేటి అభినవ్, పట్టణ పార్టీ అధ్యక్షులు అంజద్ అలీ,  యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు కుమ్మరికుంట్ల వేణుగోపాల్, మాజీ మున్సిపల్ ప్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు బైరు శైలేందర్, రాపర్తి శ్రీనివాస్, గండూరి రమేష్, అనంతుల యాదగిరి, నాయకులు పాల్గొన్నారు.