calender_icon.png 22 August, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగలు మత సామరస్యానికి ప్రతీకలు

22-08-2025 02:28:05 AM

  1. నిబంధనలు పాటించకపోతే చర్యలు
  2. భక్తిశ్రద్ధలతో పండుగలు నిర్వహించాలి
  3. గాంధీనగర్ ఏసీపీ యాదగిరి

ముషీరాబాద్, ఆగస్టు 21(విజయక్రాంతి): పండుగలు ఉత్సవాలను మత  సామరస్యానికి ప్రతీకగా  నిర్వహించుకోవాలని గాంధీనగర్ డివిజన్ ఏసిపి యాదగిరి అన్నారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయిగూడ  ముదిరాజ్ సంఘం ఆవరణలో గురు వారం రాత్రి పీస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏసిపి యాదగిరి మాట్లాడుతూ రానున్న గణేష్ పండుగ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధ లతో నిర్వహించుకోవాలని కోరారు.

గణేష్ నిమజ్జనం ఊరేగింపులో డీజే సౌండ్ ను అనుమతించమని చెప్పారు. గణేష్ వేడుకలు ఆధ్యాత్మిక శోభ వెళ్లే విరిసే విధంగా ఉండాలని సూచించారు. మండపాల వద్ద సీసీ కెమారాలు పెట్టాలని, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో గాంధీనగర్ ఇన్ స్పెక్టర్  బోస్ కిరణ్, డీఐ వెంకటేశ్వర్లు, దోమలకూడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, లేక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చిట్టి మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో వివిధ పోలీస్ స్టేషన్ కు చెందిన గణేష్ మండప నిర్వాహకులు, పీస్ కమిటీ ప్రతినిధుల లతో పాటు ఎస్త్స్రలు శ్రీనివాస్ రెడ్డి నరసింహ, హరీష్, మౌనిక, ఎలక్ట్రిసిటీ బైబిల్ హౌజ్ ఏఈ కృష్ణ, పద్మారావునగర్ ఏఈ సుబ్రహ్మాణ్యం, సిబ్బంది, లైన్ మ్యాన్ అసిఫ్ తదితరులు పాల్గొన్నారు.