calender_icon.png 8 August, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

1,247 మంది చిన్నారులకు విముక్తి

02-08-2025 02:17:44 AM

  1. హైదరాబాద్‌లో ఆపరేషన్ ముస్కాన్ 
  2. బాల కార్మిక వ్యవస్థపై పోలీసుల ఉక్కుపాదం 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (విజయక్రాంతి):  జూలై 1 నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్ నగర పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో బాల కార్మికులు, అక్ర మ రవాణాకు గురైన మొత్తం 1,247 మంది చిన్నారులను రక్షించినట్లు పోలీసులు శుక్రవారం ప్రకటించారు. వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో భాగంగా నగరంలోని ట్రాఫిక్ జంక్షన్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, నిర్మాణ ప్రాంతాలు, ఇతర కీలక ప్రదేశాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు.

ఇందుకోసం నగరంలో 28 ప్రత్యేక పో లీస్ బృందాలను ఏర్పాటు చేశారు. రక్షించిన వారిలో 1,173 మంది బాలు రు, 74 మంది బాలికలు ఉన్నారు. వీరిలో 673 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు కాగా, 574 మంది ఇతర రాష్ట్రాలు, నేపాల్ దేశానికి చెంది న వారిగా గుర్తించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 14 మంది నే పాల్‌కు చెందిన చిన్నారులు ఉన్నారు. బాలలను పనిలో పెట్టుకున్న యజమానులపై వివిధ పోలీస్ స్టేషన్లలో 55 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అంతేకాకుండా, కనీస వేతనాల చట్టం కింద 939 కేసు లు నమోదు చేసి, యజమానుల నుం చి మొత్తం రూ.47.75 లక్షల జరిమా నా వసూలు చేశారు.