calender_icon.png 8 August, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం

08-08-2025 12:16:44 AM

మణుగూరు, ఆగస్టు 7 ( విజయ క్రాంతి) :  సింగరేణి వైద్య, ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో మున్సిపాలిటీ  పరిధిలోని రాజుపేట గ్రామంలో గురువారం ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలను చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

ఈ సంధర్భంగా డిజిఎం (పర్సనల్)  రమేశ్  మాట్లాడుతూ  యాజమాన్యం తమ వంతు సామాజిక బాధ్యతగా ప్రభావిత గ్రామాలలో వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులకు  వైద్యులు సీజనల్ వ్యాధులు పట్ల తీసుకునే జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో డా. మణి  స్టాఫ్ నర్స్  రూప శ్రీ, సేవ కో ఆర్డినేటర్  కె. వీ. మారేశ్వర రావు, హాస్పిటల్ సిబ్బంది రాము రవి, గ్రామస్తులు పాల్గొన్నారు.