08-08-2025 12:16:03 AM
ఘట్ కేసర్, ఆగస్టు 7: ఘట్ కేసర్‌రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్ చందుపట్ల ధర్మ రెడ్డి బీ ఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రైతు విభాగం అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని తెలిపారు. రాజీనామా పత్రాన్ని అధిష్టానానికి పంపినట్లు తెలిపారు. ఏ పార్టీలో చేరబోనని సామాజిక కార్యకర్తగా కొనసాగుతామని తెలిపారు.