calender_icon.png 8 August, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లంపల్లి వద్ద కూలిన బ్రిడ్జి

08-08-2025 12:17:41 AM

ములుగు/మల్లంపల్లి, ఆగస్టు 7 (విజయక్రాంతి): ములుగు జిల్లా మల్లంపల్లి కెనాల్ వద్ద ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి గురువారం రాత్రి కూలిపోయింది. దీంతో ములుగు నుంచి వరంగల్, హనుమకొండ, హైదరాబాద్ వైపు వెళ్లాల్సిన వాహనాలు, ఆర్టీసీ బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటువైపు వాహనాలు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ములుగు వైపు నుంచి వెళ్లే వాహనాలను రేగొండ, -పరకాల మీదుగా దారి మళ్లించారు.