17-11-2025 01:16:56 AM
ముషీరాబాద్, నవంబర్16 (విజయక్రాంతి) : పెంపుడు జంతువుల మీద పిల్లల కు అవగాహన పెంపొందించేందుకు, వాటి మీద వాళ్లు అనురాగం పెంచుకోవ డానికి మార్స్ పెట్ కేర్ సంస్థ భారత దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన టింకిల్ కామిక్స్ తో చేతులుక లిపిందని మార్స్ పెట్ కేర్ సంస్థ ప్రతినిధులు ఆదివారం నగరంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ ఈ ఒప్పందం పిల్లల కోసం మార్స్ వారి యంగ్ ఏంజెల్స్ ప్రో గ్రాంకు, పెంపుడు జంతువులకు మెరుగైన ప్రపంచాన్ని ఇవ్వాలన్న విస్తృతల క్ష్యానికి అనుగుణంగా ఉంటుందని అన్నారు.