18-08-2025 11:52:23 PM
వాజేడు,(విజయక్రాంతి): భారీ వర్షాలు వీడడం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాజేడు మండలంలో సోమవారం చింతూరు గ్రామంతో పాటు పలు గ్రామాల్లో మిర్చి నారుమళ్లు వర్షపు నీటిలో నిండా మునిగాయి. గత రెండు సంవత్సరాలుగా మిర్చి పంట రైతుల కంట కన్నీరు పెట్టిస్తుంది.
గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం నానా కష్టాలు పడి వేల రూపాయలు పెట్టి గింజలు కొని నారుమళ్లలో పెడితే ఈ భారీ వర్షాలతో మిర్చి నారుమళ్లు నీటిలోనే ఉండడంతో తీవ్ర నష్టం జరుగుతుందని మిర్చి రైతులు దిగులు పడుతున్నారు.