calender_icon.png 19 August, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి

19-08-2025 12:00:00 AM

బాన్సువాడ, ఆగస్టు 18  : కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి శివారులో కల్వర్టు వద్ద సోమవారం చేపలు పట్టేందుకు దేశాయి పేట్ గ్రామానికి చెందిన రాజు(28) వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ 765 జాతీ య రహదారిపై కల్వర్టు వద్ద నీరు ప్రవహించేలా ఏర్పాటు చేసిన పైప్ లో ఇరుక్కుని రాజు అనే వ్యక్తి మృతి చెందాడు.

దీంతో బయటపడే అవకాశం లేకపోవడంతో నీట మునిగి మృతి చెంది ఉంటాడని స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకు న్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.  గజ ఈతగాళ్లు జెసిబి సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.