19-08-2025 12:00:00 AM
కామారెడ్డి, ఆగస్టు 18 (విజయ క్రాంతి) : ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాం గ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి వారి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ రోజు ప్రజా వాణి కార్యక్రమానికి వివిధ సమస్యల పరిష్కారానికి 69 అర్జీలు వచ్చాయి.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగం పై విశ్వాసంతో ప్రజావాణి కార్యక్రమం ద్వారా తమ సమ స్యలు పరిష్కారమవుతాయని ప్రజ లు ఎంతో విశ్వాసంతో వారి సమస్యల పరిష్కారానికి దరఖాస్తులను అందజేస్తారని వాటిని ప్రతి ఒక్క శాఖ అధికారి ప్రత్యేకంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకొని రిపోర్ట్ ను కలెక్టరేట్ లో అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్, కలెక్టరేట్ ఏఓ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 52 ఫిర్యాదులు
నిజామాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి) : ప్రజావాణి కార్యక్రమా నికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 52 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.