calender_icon.png 27 December, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువకుడి గొంతు కోసిన చైనా మాంజా

27-12-2025 02:36:14 AM

  1. కీసరలో బైక్‌పై వెళ్తుండగా ఘటన
  2. మెడకు ఏకంగా 19 కుట్లు

సికింద్రాబాద్ డిసెంబర్ 26 (విజయ్ క్రాంతి): మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లాలోని కీసరలో బైక్‌పై వెళ్తున్న ఓ యుకుడి మెడను చైనా మాంజా కోసిన ఘటన శుక్రవారం జరిగింది. మెడకు తీవ్రగాయమవడంతో ఏకంగా 19 కుట్లు పడ్డాయి. కీసరలో జశ్వంత్ అనే యువకుడు బైక్‌పై వెళ్తున్నాడు. అతడి మెడకు గాలిపటం దారం (చైనా మాంజా) తాకి తీవ్రగాయమై 19 కుటుల పడ్డాయి.

సంక్రాంతి సమీపిస్తుండటంతో ఆకాశంలో పతంగులు సందడి చేస్తున్నాయి. కానీ ఆ సరదా వెనుక ప్రమాదం కూడా పొంచి ఉంది. చైనా మాంజాపై నిషేధం ఉన్నా ఇప్పటికీ యథేచ్ఛగా విక్రయాలు జరుగుతు న్నాయి. గాలిపాటలు ఎగేరేసేటప్పుడు పిల్లలు, రోడ్లపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు, ప్రయాణికులు జాగ్రత్త వహించండి.