27-12-2025 02:38:10 AM
మాజీ ఎంపీ వీ హనుమంతరావు
ముషీరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): జనవరి 7 నుంచి అండర్ -19 రాజీవ్ గాంధీ ఆల్ ఇండియా క్రికెట్ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభించనున్నట్లు క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ చైర్మన్, వి. హనుమంతరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఎల్బీ స్టేడియంలోని పతే మైదాన్ క్లబ్‌లో పోటీలకు సంబంధించిన బ్రోచర్ ను వారు పలువురితో కలిసి విడుదల చేశారు. అనంతరం వి. హనుమంతరావు మాట్లాడుతూ గత 18 సంవత్సరాల నుండి స్వర్గీయ రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం క్రికెట్ ఫెడరే షన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాదులో అండర్ -19, చండీగఢ్ లో అండర్ -17, చెన్నైలో అండర్ -15, క్రికెట్ ఛాంపియన్ షిప్‌ను నిర్వహిస్తున్నానని తెలిపారు.
ఈ టోర్నమెంట్‌లో 4 దేశాలు 10 రాష్ట్రాలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఎల్బీ స్టేడి యం, విజయ్ ఆనంద్ గ్రౌండ్ అత్తాపూర్, అంబర్పేట్ వాటర్ వరక్స్ గ్రౌండ్‌లో క్రికెట్ ఛాంపియన్ షిప్ పోటీలు జనవరి 7 నుంచి 10 వరకు జరుగుతుందని తెలిపారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఫైనల్ పోటీలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులకు బహుమతులను ప్రధానం చేస్తారని తెలిపారు.
ఈ టోర్నీలో శ్రీలంక, దుబాయ్, మలేషియా, నేపాల్, తమిళనాడు, మహారాష్ట్ర, చెన్నై, బీహార్, విదర్భ, కర్ణాటక, బెంగళూర్, తెలంగాణ, క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ జట్లు పాల్గొంటాయని చైర్మన్ వి. హనుమంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆది అవినాష్, జనరల్ సెక్రెటరీ, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శంభుల శ్రీకాంత్ గౌడ్, ఆర్. లక్ష్మణ్ యాదవ్, పంజాల జ్ఞానేశ్వర్ గౌడ్, పి. నారాయణస్వామి,పంజాల ధనంజయ గౌడ్, సద్గురు శ్రీధర్ గౌడ్, నేమూరి మహేందర్, షకీల్, కుంకుమ మన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.