calender_icon.png 27 December, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హస్తినకు సీఎం రేవంత్‌రెడ్డి

27-12-2025 02:35:50 AM

  1. నేడు ఢిల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
  2. ఓబీసీ జాతీయ సలహామండలి సమావేశంపైనా చర్చ 
  3. అనంతరం కేంద్ర మంత్రులతోనూ భేటీ కానున్న సీఎం 
  4.   28వ తేదీ రాత్రి తిరిగి హైదరాబాద్‌కు..

హైదరాబాద్, డిసెంబర్  26 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. శనివారం ఢిల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు  శుక్రవారమే హస్తిన బాటపట్టారు.  ఏఐసీసీ అధ్యక్షు డు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సీడబ్ల్యూసీ సమావేశంలో దేశ వ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మా ర్పు, పార్టీ  బలోపేతానికి తీసుకునే వ్యూహాలపై చర్చ జరగనున్నట్లు తెలిసింది. ఇక,  కాంగ్రెస్ ఓబీసీ జాతీయ సలహా మండలి సమావేశం జనవరి మూడో వారంలో హైదరాబాద్ వేదికగా జరగనుంది. 

సమావేశా నికి అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరుకానున్నారు. ఈ సమావేశం తేదీని కూడా ఫైనల్ చేసే అవకాశం ఉంది.  ఢిల్లీ పెద్దలతో సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి  కేంద్ర మంత్రులతో సమావేశమై.. రాష్ట్రంలోని పెండింగ్ అంశాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.  ఈనెల 28న రాత్రి తిరిగి ఆయన హైదరాబాద్‌కు రానున్నారని, 29న జరిగే అసెంబ్లీ సమావేశాలకు  సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, హైదరాబాద్‌లో జరిగే  ఓబీసీ  సమావేశంలో శిక్షణ తరగతులు, ఓబీసీ జాతీయ సలహా మండలి ఎజెండాపైన చర్చించేందుకు హాజరుకావాలని ఆ మండలి సభ్యులు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావుకు కూడా ఆహ్వానం అందినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.