23-08-2025 12:45:19 AM
సిద్ధిపేట రూరల్: సిద్దిపేట రూరల్ మండలలోని సీతారాంపల్లి గ్రామంలో శుక్రవారం రోజున రైతు రెడ్డి లింగం క్యటిల్ షెడ్డు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపిడిఓ మురళీధర్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం పంచాయితి రాజ్ శాఖ లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులు జాతార 2025 లో భాగంగా వివిధ రకాల పనులు వాటర్ షెడ్, స్వచ్చ భారత్ మిషన్,కోళ్ల షెడ్డు, మేకలషెడ్డు,భావుల తవ్వకం ఫారంఫాండ్ నిర్మాణం, నీటి నిల్వల కుంటల చెక్డ్యాం నిర్మాణం చేపట్టనున్నారు కావున మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని వివరించారు.